Bathukamma Celebrations | ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ ఉగాండా’ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం- ఉగాండా ప్రాంగణంలో బతుకమ్మ పండుగ సంబరాలు (Bathukamma Celebrations) ఘనంగా జరుపుకున్నారు. ప్రాంతాలకతీతంగా మహిళలు , పురుషులు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ పండుగకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ.. బతుకమ్మ ఆడుతూ …తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు.
2 గంటలపాటు సాగిన ఈ ఆటపాటల అనంతరం ..బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనలో వేసి, పోయిరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు. బతుకమ్మ పండగ సంబరాలను, తెలంగాణా సంస్కృతిని అక్కడి ఆహుతులంతా తిలకించి ఎంతో ఆనందపడ్డారు.. మున్ముందు జరిగే బతుకమ్మ సంబరాల్లో తాము కూడా భాగస్వాములవుతామని వేడుకలను తిలకరించినవారంతా చెప్పారు. వచ్చే ఏడాది నుండి బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు.

Bathukamma Celebrations1

Bathukamma Celebrations2