Bangladesh | ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం కొత్తగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటైంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుడు నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. భారత్ అనుకూల, పాకిస్థాన్ అనుకూల రాజకీయాలకు ఇక తమ దేశంలో చోటు లేదని ప్రకటించారు.
నిరుడు ఈ విద్యార్థులు యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మువ్మెంట్ లేదా స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో ఉద్యమాలు నిర్వహించారు. ఈ సంస్థ జాతీయ నాగరిక్ పార్టీగా మారింది.