Muhammad Yunus | నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌కు ఆరు నెలల జైలుశిక్ష
Muhammad Yunus | బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనిస్‌కు స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలడంతో జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ ఖుర్షీద్ ఆలం ఖాన్ తెలిపారు.
Muhammad Yunus | బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనిస్‌కు స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలడంతో జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ ఖుర్షీద్ ఆలం ఖాన్ తెలిపారు. ఆయనతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష ఖరారైంది. యూనిస్‌కు జైలు శిక్ష విధించడంపై ప్రతిపక్షాలు, మద్దతుదారులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసినట్లు ఘనత సాధించగా.. ప్రజలను దోపిడీ చేశారని ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.
యూనస్ 2006లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. బంగ్లాదేశ్‌లో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా.. ఇటీవల మహమ్మద్‌పై ఆరోపణలు చేస్తున్నారు. పేదల రక్తాన్ని పీలుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, మహమ్మద్ జైలు శిక్షపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది రాజకీయ కుట్రేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సహా 160 మంది ప్రముఖులు యూనస్‌పై తీసుకున్న చర్యలను ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

