ఢాకా, డిసెంబర్ 6: ఇప్పటికే పలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశమైన బంగ్లాదేశ్.. అవసరమైతే దాడికి కూడా వెనుకాడమన్న రీతిలో భారత్ సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ఫ్లాగ్ టీబీ2 కిల్లర్ డ్రోన్లను మోహరించింది. బంగ్లాదేశ్లో ప్రధాని హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు అధికమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం ఈ డ్రోన్లు పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో మోహరించి ఉన్నాయి.
బంగ్లాదేశ్ అర్మీ ఈ టీబీ2 డ్రోన్లు రక్షణ, నిఘా మిషన్లలో వినియోగిస్తుంది. దీనిపై భారత్ ఆర్మీ స్పందిస్తూ.. తాము అప్రమత్తమయ్యామని, హెరన్ టీపీ లాంటి డ్రోన్లను మోహరించి ఉంచామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా, రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్.. భారత్లో ఉన్న ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది.