Bangla Judge | భారత సరిహద్దుల్లో బంగ్లా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్
Bangla Judge | భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా తెలిపింది.
Bangla Judge : భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు.
కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగష్టు 8న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హసీనా ప్రభుత్వంలో పనిచేసిన మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దీపూ మోని, పలువురు ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు.
అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా న్యాయశాఖ మాజీ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మా ఢాకా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టు దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.
ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది. హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బీఎన్పీ సెక్రెటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగీర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

