కాఠ్మాండూ : ‘బాలెన్’గా ప్రసిద్ధుడైన బాలేంద్ర షా నేపాల్ ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామచంద్ర పౌదెల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
నేపాల్ ఉప రాష్ట్రపతి, సీజేఎన్, మాజీ ప్రధానులు, తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేపాల్ 47వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏండ్ల షా ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించారు. గురువారం ఆయన ప్రతినిధుల సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.