మాడ్రిడ్, జూన్ 21: పురుషులు, స్త్రీలలో జుట్టు రాలటం సర్వసాధారణం. వైద్య పరిభాషలో ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’గా పిలుచుకునే ఈ సమస్యకు మాడ్రిడ్‌లోని సాన్ కార్లోస్ క్లినికల్ దవాఖాన సైంటిస్టులు నివారణ కనుగొన్నారు. జట్టు రాలటాన్ని నివారించగల సరికొత్త చికిత్స విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీరు కనుగొన్న పద్ధతుల్లో చేసిన ప్రయోగాల్లో ఎలుకల్లో 100 శాతం జుట్టు తిరిగి పెరగడానికి దారి తీసింది. అన్ని మగ ఎలుకల్లో జుట్టు పూర్తిగా తిరిగి ఏర్పడగా, ఆడ ఎలుకల్లో 90శాతం పూర్తి జట్టు పునరుద్ధరణ జరిగింది.
ప్రధాన పరిశోధకుడు ఎడ్వర్డ్ లోపెజ్ బ్రాన్ మాట్లాడుతూ, ఏటీపీ (జీవ కణాల్లో శక్తిని నిల్వ చేసేది, శక్తిని బదిలీ చేసేది) శక్తికి మూల కణాల పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలపడం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తున్నదని వివరించారు. మనుషులపై ఇందుకు సంబంధించి ప్రయోగ పరీక్షలు తప్పనిసరి అయినప్పటికీ, జుట్టు రాలడాన్ని పరిష్కరించటంలో ప్రయోగ ఫలితాలు ఆశాజనకమైన ముందడుగా భావిస్తున్నట్టు చెప్పారు. మానవులపై ట్రయల్స్ జరిపి..ప్రయోగ ఫలితాల్ని నిర్ధారించుకోవాల్సిన అవసరముందని పరిశోధకులు భావిస్తున్నారు.