కోతులకు తెలివి ఎక్కువ. భూమిపై తెలివైన జంతువుల్లో మొదటి వరుసలో ఉంటాయి. మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతాయి. అడవిలో చెట్లపై ఎగురుతూ, దుంకుతూ ఆనందంగా ఉంటాయి. కాగా, ఓ కోతి పిల్లను జూలో అద్దాల బోనులో బంధించగా, అది బయటపడేందుకు నానా తిప్పలు పడింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను డిస్కవర్. యానిమల్ అనే యూజర్ ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో కోతిపిల్ల అద్దాల బోనులో కనిపిస్తుంది. అక్కడినుంచి బయటపడేందుకు ఓ రాయి తీసుకొచ్చి అద్దాన్ని బద్దలుకొడుతుంది. అద్దం పగిలిన శబ్దం రాగానే భయంతో పరుగులు తీస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 8లక్షల మంది వీక్షించారు. కోతిపిల్ల విచారంగా ఉందని, దాన్ని విడిచిపెట్టాలని నెటిజన్లు కామెంట్ చేశారు.