భూమిపై ఉన్న అన్ని క్షీరదాల్లో ఏనుగులు అతిపెద్దవి. అలాగే, అవి భూమి మీద నడిచే అత్యంత ప్రేమగల, ఫ్రెండ్లీ నేచర్గల జీవులు. మనుషులకు సమానమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. మనలాగే సరదాగా గడిపేందుకు ఇష్టపడతాయి. కాగా, ఓ పిల్ల ఏనుగు దాని సంరక్షకుడితో కలిసి ఆడుకుంటున్న ఓ హృదయపూర్వకమైన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ‘బేబీ ఏనుగు కౌగిలింత’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో పిల్ల ఏనుగు దాని సంరక్షకుడిని కౌగిలించుకుంటుంది. ప్రేమగా అతడిని తొండంతో నిమురుతుంది. దాని సంరక్షక్షుడు కూడా దాన్ని ప్రేమగా పట్టుకుని నవ్వులు చిందించాడు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ ఈ వీడియోను లక్షకుపైగా మంది లైక్ చేయడం విశేషం.
Baby elephant cuddle.. 😊 pic.twitter.com/yl8yCir2gU
— Buitengebieden (@buitengebieden) June 26, 2022