శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 19:35:29

పెయింటర్‌ తో గున్న ఏనుగు సరదా ఆట..వీడియో వైరల్‌

పెయింటర్‌ తో గున్న ఏనుగు సరదా ఆట..వీడియో వైరల్‌

థాయ్‌లాండ్‌:  జూలో ఏర్పాటు చేసిన కంచెకు జూ కీపర్‌  రంగులు వేస్తున్నాడు. ఇంతలో ఎన్‌క్లోజర్‌లో నుంచి ఖున్సుక్‌ అనే గున్న ఏనుగు పెయింటర్‌ డాన్‌ డయీంగ్‌ దగ్గరకు వచ్చింది. రంగులేస్తుంటే..ఖున్సుక్‌  కంచె పై నుంచి తన తొండంతో డాన్‌ డయీంగ్‌ను తడిమింది. డాన్‌ డయీంగ్‌ మాత్రం తన పని చేసుకోవాలన్నట్లుగా ఏనుగుకు సైగ చేశాడు. అయితే గున్న ఏనుగు మాత్రం అతన్ని వదల్లేదు. కంచెపై నుంచి తొండంతో అతన్ని తాకుతూ..కాళ్లు పైకి లేపి ఎన్‌క్లోజర్‌ నుంచి వచ్చేందుకు ప్రయత్నించింది.

డాన్‌ డయీంగ్‌ ఇక చేసేదేమి లేక కాసేపు ఆ ఏనుగుతో సరదాగా ఆడుకున్నాడు. గున్న ఏనుగు ఫన్నీగా పెయింటర్‌తో ఆడిన ఆట వీడియోను ఎంపీ పరిమల్‌ నత్వానీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆదివారం ఈ వీడియోను షేర్‌ చేయగా..5వేలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌ మైలో గతేడాది షూట్‌ చేసిన వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 


logo