America | టెహ్రాన్, నవంబర్ 3: పశ్చిమాసియాలో తమ అధునాతన యుద్ధ విమానాలు బీ-52 బాంబర్లను అమెరికా మోహరించింది. దీనిపై ఇరాన్ చీఫ్ ఆయతుల్లా ఖమేనీ తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌కు గట్టి సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను పశ్చిమాసియాలో మోహరించింది. ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు వీటిని మోహరిస్తున్నట్టు ప్రకటించింది.
మరోవైపు ఇజ్రాయెల్ కమాండోలు లెబనాన్‌లో తమ దాడులను మరింత తీవ్రతరం చేసి దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలపై ఖమేనీ మాట్లాడుతూ ‘మా శత్రువులు అమెరికా, ఇజ్రాయెల్‌లు రెండూ దీనికి కచ్చితంగా తీవ్ర ప్రతిఫలం అనుభవించిక తప్పదు’ అని అన్నారు.