భావోద్వేగం.. కివీస్‌కు ఏడాది తర్వాత ఆసీస్ ప్రయాణికులు

ఆక్లాండ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంబరాలు నెలకొన్నాయి. రెండు దేశాల విమానాశ్రయాల్లో భావోద్వేగ సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఏడాది విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో సోమవారం రోజున రెండు దేశాల మధ్య ప్రజలు వేల సంఖ్యలో ప్రయాణించారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. న్యూజిలాండ్‌కు దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత తొలిసారి ఆస్ట్రేలియన్లు ప్రయాణించారు. క్వారెంటైన్ ఆంక్షలు లేకుండా ప్రయాణం చేయడం ఇదే తొలిసారి.
రెండు దేశాలు కోవిడ్ నియంత్రణ కోసం తీవ్రంగా కృషి చేశాయి. కఠిన ఆంక్షలతో ఇన్ఫెక్షన్ రేటును అదుపులో ఉంచాయి. ఆస్ట్రేలియాలో అనేక విమానాశ్రయాలు కివీస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తమ స్వంతవారిని చూసుకునే ఆశతో వెళ్తున్న వాళ్లంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. గత ఏడాది మార్చిలో రెండు దేశాలు సరిహద్దుల్ని మూసివేశాయి. ఒకవేళ ప్రయాణం చేయాలనుకున్నవారు క్వారెంటైన్ కావాలన్న నియమావళి విధించారు. అయితే గత అక్టోబర్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణికులను మాత్రం క్వారెంటైన్ లేకుండా ఆస్ట్రేలియాలోకి అనుమతి ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

