ఎలుకలు వేధిస్తున్నాయ్.. ఐదు వేల లీటర్ల విషం పంపండి..!
Poison for rats: అందుకే భారత్ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్ అనే విషాన్ని దిగుమతి చేసుకోవాలని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

సిడ్నీ: ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో బాధపడుతుంటే ఆస్ట్రేలియాను మాత్రం కరోనాతోపాటు ఎలుకలు కూడా వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలు ఎలుకల సమస్యతో బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా న్యూసౌత్‌వేల్స్‌లో లక్షల సంఖ్యలో ఎలుకలు పంటలపై, ఆవాసాలపై దాడి చేసి భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. దాంతో న్యూసౌత్‌వేల్స్ వాసులు ఈ ఎలుకల బెడదతో విసిగిపోతున్నారు.
ఎలుకలతో ఏ కొత్త మహమ్మారి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే భారత్ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్ అనే విషాన్ని దిగుమతి చేసుకోవాలని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా భావిస్తున్నది. అందుకే ఐదు వేల లీటర్ల బ్రొమాడియోలోన్‌ను తమకు ఎగుమతి చేయాలని న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వం భారత్‌ను కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

