Diabetes | కారుచీకట్లో కాంతిరేఖలు.. మధుమేహానికి శాశ్వత పరిష్కారం!
మధుమేహ బాధితులకు శుభవార్త.. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకొనేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో, మాత్రలతో విసిగి వేసారిపోతున్నవారికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కారుచీకట్లో కాంతిరేఖలాంటి వార్త చెప్పారు. క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా అనుకోకుండా క్లోమాన్ని పునరుద్ధరించే విధానాన్ని ఆవిష్కరించినట్టు ప్రకటించారు.
- క్లోమాన్ని పునరుద్ధరించే విధానం ఆవిష్కరణ
- అనుకోకుండా కనిపెట్టిన ఆస్ట్రేలియా పరిశోధకులు
- క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అద్భుతాలే
Diabetes | మెల్బోర్న్, జనవరి 5: మధుమేహ బాధితులకు శుభవార్త.. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకొనేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో, మాత్రలతో విసిగి వేసారిపోతున్నవారికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కారుచీకట్లో కాంతిరేఖలాంటి వార్త చెప్పారు. క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా అనుకోకుండా క్లోమాన్ని పునరుద్ధరించే విధానాన్ని ఆవిష్కరించినట్టు ప్రకటించారు. శరీరంలో చక్కెరలను (గ్లూకోజ్) నియంత్రించేందుకు, జీవకణాలు దానిని శోషించుకొనేందుకు ఇన్సులిన్ ప్రధాన వాహకం అన్న విషయం తెలిసిందే. ఈ ఇన్సులిన్‌ను క్లోమగ్రంథి ఉత్పత్తి చేస్తుంది. టైప్-1 డయాబెటిక్ బాధితుల్లో పుట్టుకతోనే క్లోమగ్రంథి దెబ్బతిని ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే శక్తిని కోల్పోతుంది. వాళ్లు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది.
టైప్-2 డయాబెటిక్ బాధితులకు వివిధ కారణాల వల్ల క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోతుంది. వాళ్లు సమస్య తీవ్రతను బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ లేదా మాత్రలు వాడుతుంటారు. ఇప్పటివరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన బేకర్ హార్ట్ అండ్ డయాబెటిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు క్లోమగ్రంథి స్రావాల ప్రవాహ నాడుల్లో ఏర్పడిన క్యాన్సర్ కణతులను నయం చేసేందుకు ప్రకృతిసిద్ధమైన విధానాలపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్హాన్సర్ ఆఫ్ జెస్ట్ హోమోలాగ్-2 ఎంజైమ్ (ఈజెడ్హెచ్2)ను ఆ కణతులపై ప్రయోగించారు. ఈ ఎంజైమ్ సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. క్యాన్సర్ కణతులపై దాడిచేసిన ఈ ఎంజైమ్ పరిశోధకులు ఊహించని విధంగా డక్టల్ ప్రోజెనిటర్ కణాలను ఉత్తేజితం చేసింది.
జీవకణాలకు ఈ డక్టల్ ప్రోజెనిటర్ కణాలను వారసులుగా పేర్కొంటారు. గ్లూకోజ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న క్లోమంలోని ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే బీటా సెల్స్‌ను ఈ డక్టల్ కణాలు పునఃసృష్టి చేశాయి. దీంతో ఎప్పటికీ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదనుకొన్న క్లోమగ్రంథి ఉన్నట్టుండి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టిందని పరిశోధకుల బృందం నాయకుడు సామ్ ఎల్-ఓస్టా తెలిపారు. ఈ పరిశోధన ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నదని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది విజయవంతమైతే వైద్యప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

