
టెల్ అవీవ్: 8 వేల ఏండ్ల వరకు తమ దేశాన్ని వదిలి వెళ్లకూడదంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిపై ఇజ్రాయెల్‌లోని ఓ కోర్టు నిషేధం విధించింది. నోమ్ హప్పర్ట్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌కు చెందిన మహిళను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. చాలాకాలం పాటు ఆస్ట్రేలియాలోనే నివసించారు. ఆ తర్వాత వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అతడి భార్య ఇజ్రాయెల్‌కు వెళ్లింది. తన పిల్లలకు దగ్గరగా ఉండేందుకు 2012లో హప్పర్డ్ కూడా వెళ్లాడు. ఆ తర్వాత విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టులో దావా వేసింది. దీంతో భరణం కింద దాదాపు రూ.22 కోట్లు చెల్లించాలని, లేదంటే 9999 డిసెంబర్ 31 వరకు ఇజ్రాయెల్‌ను విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.