మెల్బోర్న్: ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సుముఖత వ్యక్తం చేసింది. రష్యా దాడితో కుదేలవుతున్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు ఆ దేశానికి 50 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధ సామాగ్రిని అందించనున్నట్లు ఆస్ట్రేలియా చెప్పింది. ఆ జాబితాలో మిస్సైళ్లు, మందుగుండు సామాగ్రి, మిలిటరీ హార్డ్‌వేర్ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీకి ప్రాణాంతకమైన సైనిక సామాగ్రిని అందించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.