Bangladesh | ఢాకా, డిసెంబర్ 11 : బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు దానిపై యూటర్న్ తీసుకుంది. హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది. ప్రధాని హసీనా ఆగస్టులో పదవీచ్యుతురాలైన తర్వాత దేశంలో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటటించింది. ఈ అల్లర్లకు సంబంధించి 70 మందిని అరెస్ట్ చేసినట్టు మహ్మద్ యూనిస్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ తెలిపారు.