Russia Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. 29 మంది మృతి
Russia Plane Crash | క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు.
Russia Plane Crash | క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు.
ఆంటోనోవ్ – 26 (Antonov An – 26) మోడల్‌కు చెందిన విమానం మంగళవారం సాయంత్రం 6 గంటల (స్థానిక కాలమాన ప్రకారం )కు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ఆ విమానానికి రాడర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఆ విమానం ఒక కొండను ఢీకొని కూలిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో విమానంలో 23 మంది సైనికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారందరూ మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా వేసింది. విమానంపై దాడి జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.
ప్రమాదానికి గురైన ఆంటోనోవ్ ఎన్- 26 విమానాలను 1960 చివరలో ప్రవేశపెట్టారు. వీటని సైనిక అవసరాలతో పాటు సరుకు రవాణాకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మోడల్‌కు చెందిన విమానాలు గత కొన్నేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇదే ఏడాది దక్షిణ సూడాన్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఉక్రెయిన్‌లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 2020లో శిక్షణ విమానం కూలి 20 మంది మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

