Guyana School | దక్షిణ అమెరికా (South America)లోని గుయానా (Guyana)లో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహం ( School Dormitory)లో భారీ అగ్నిప్రమాదం (School Dormitory Fire) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
సెంట్రల్ గుయానా మైనింగ్ పట్టణంలో (central Guyana mining town)ని మహదియా సెకండరీ స్కూల్ (Mahdia Secondary School)లో ఆదివారం రాత్రి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరికొంతమంది గాయపడినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Ram Charan | జీ20 సదస్సులో పాల్గొననున్న రామ్ చరణ్.. శ్రీనగర్ బయలుదేరి వెళ్లిన మెగా హీరో
India Corona | 500 లోపే కొత్త కేసులు.. 7 వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు