ఉక్రెయిన్‌లో మాల్‌పై క్షిపణి దాడి.. 16 మంది మృత్యువాత
కీవ్ : ఉక్రెయిన్‌లోని సెంట్రల్ సిటీ క్రెమెన్‌చుక్‌లోని ఓ షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి జరిపింది. రద్దీగా ఉండే మాల్‌పై దాడి జరుపడంతో 16 మంది మృత్యువాతపడ్డారు. మరో 59 మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల అధిపతి సెర్గి క్రుక్ మంగళవారం వేకువ జామున ప్రకటించారు. షాపింగ్ మాల్‌పై మిస్సైల్ దాడి అనంతరం రెస్క్యూ పనులు, శిథిలాల తొలగింపు, మంటలను ఆర్పివేసే ప్రధాన పనులు కొనసాగుతున్నాయన్నారు. మిస్సైల్ దాడి సమయంలో మాల్లో వెయ్యి మందికిపైగా పౌరులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు.
మంటలతో ఫైటర్లు పోరాడుతున్నారని, బాధితుల సంఖ్యను ఊహించలేమని జెలెన్స్కీ ఫేస్బుక్లో పేర్కొన్న ఆయన.. ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, రష్యా క్షిపణి దాడిని నగర మేయర్ విటాలి మాలెట్‌స్కీ ఖండించారు. పౌర జనాభాపై విరక్తికరమైన తీవ్రవాద అచర్య అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మరిన్ని భారీ ఆయుధాలను సరఫరా చేయాలని, రష్యాపై ఆంక్షలు విధించాలని మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా మానవాళికి అవమానకరం, అది పర్యావసరాలను ఎదుర్కొవాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

