లూసియానా: 16 ఏళ్ల కిందట అమెరికాను వణికించిన కత్రినా హరికేన్ గురించి తెలుసు కదా. అగ్రరాజ్య చరిత్రలో అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిందా హరికేన్. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటిదే హరికేన్ ఐదా( Hurricane Ida ) అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో తీరాన్ని దాటింది. ఇప్పటి వరకూ దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఇది కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ హరికేన్.. ఏకంగా మిసిసిపీ నదీ ప్రవాహాన్నే రివర్స్ చేసిందంటే ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ఈ హరికేన్ ఐదా ధాటికి లూసియానా రాష్ట్రం వణికిపోతోంది.
ఇక ఈ భయానక హరికేన్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్లు ఫొటోలు తీశారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్ థామస్ పెస్కెట్ దీనికి సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. తీరం దాటే ముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉన్న తుఫాను అంతరిక్షం నుంచి చాలా భయానకంగా కనిపించింది. పర్యావరణ మార్పుల కారణంగా ఇలాంటి భారీ హరికేన్లు తరచూ అమెరికా తీరాన్ని తాకుతున్నాయి. దీనిపై ఆస్ట్రోనాట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఆస్ట్రోనాట్ మేగన్ ఆర్థర్ కూడా ఈ హరికేన్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు.
Goodmorning omg the Mississippi river is flowing BACKWARDS.
— UNACCEPTABLE Lisa Marie Mary (@LisaMarieMary) August 29, 2021
My son lives in Algiers Point, where it is at its deepest — 20 feet!!
And. it. is. flowing. backwards.#lawx #mswx #ida pic.twitter.com/u9UgnZk03I
Power outages power lines down blocking roads out storm surge coming up the channels and the Mississippi River now. Incredibly dangerous weather event. #disasterrecovery #businesscontinuity #cre #ifma #boma #iicrc #propertymanagement #facilitiesmanagementpic.twitter.com/VUtAd9MgKT
— Chicago Restoration Consultanting (@ChicagoFireH2o) August 29, 2021