ఒమిక్రాన్ వైరస్ను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోసు సమర్థవంతంగా పనిచేస్తోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయం ఆస్ట్రాజెనెకా ఫార్మా గురువారం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం కరోనా నుంచి సహజంగా కోలుకున్న వారికంటే బూస్టర్ డోసు తీసుకున్న వారిలో యాంటిబాడీలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ వెల్లడించింది.
బూస్టర్ డోసు ద్వారా పెరిగిన యాంటిబాడీలు ఒమిక్రాన్ వేరియంట్నును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో ఇండిపెండెంట్ పరిశోధకులు పనిచేశారని.. వారికి తమ కంపెనీతో సంబంధం లేదని ఆస్ట్రాజెనెకా అధికారులు తెలిపారు.