షాంఘై : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంఘం(SCO Meet) శిఖరాగ సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఎస్సీవో సమావేశంలో పుతిన్, మోదీపైనే అందరి దృష్టి నిలిచింది. ఓ దశలో పుతిన్, మోదీ.. ఇద్దరూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందు నుంచే వెళ్లారు. పుతిన్, మోదీలు మాట్లాడుకుంటూ ముందుకు నడిచారు. వరుసగా నిలబడ్డ పాక్ ప్రధాని గురించి ఆ ఇద్దరూ ఆలోచించలేదు. పుతిన్, మోదీ ముందు నుంచి వెళ్తుంటే పాక్ ప్రధాని షరీఫ్ వాళ్లను చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. మీటింగ్ ప్రారంభానికి ముందు మోదీ, పుతిన్ హగ్ చేసుకున్నారు.
Pakistan PM Shehbaz Sharif looks on as PM Modi and President Putin walk past him at the SCO Summit. pic.twitter.com/7u9FgnS6an
— Tar21Operator (@Tar21Operator) September 1, 2025
ఎస్సీవో ప్రోసిడింగ్స్ తర్వాత పుతిన్, మోదీలు ద్వైపాక్షిక భేటీ కోసం కలిసి వెళ్లారు. పుతిన్‌తో సంభాషణ చాలా గాఢంగా ఉన్నట్లు మోదీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎస్సీవో కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక మీటింగ్ జరిగే రిట్జ్ కార్లటన్ హోటల్ వరకు ఇద్దరూ ఒకే కారులో కలిసి వెల్లారు. మోదీ రాక కోసం పుతిన్ పది నిమిషాలు ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు కారులోనే వివిధ అంశాలపై చర్చించనుకున్నారు. ఆ తర్వాత ద్వైపాక్షక భేటీలోనూ గంటకుపైగా మాట్లాడుకున్నారు.
Had an excellent meeting with President Putin on the sidelines of the SCO Summit in Tianjin. Discussed ways to deepen bilateral cooperation in all sectors, including trade, fertilisers, space, security and culture. We exchanged views on regional and global developments, including… pic.twitter.com/DhTyqOysbf
— Narendra Modi (@narendramodi) September 1, 2025