బీజింగ్: చైనాలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. హాస్పిటల్స్‌లోని బెడ్స్ అన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు రోగులకు నేలపైనే సీపీఆర్ వంటి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అలాగే కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేని డాక్టర్లు అలసటతో కుప్పకూలుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనా జీరో కోవిడ్ పాలసీని కఠినంగా అమలు చేసింది. కరోనా లక్షణాలున్న వారిని బలవంతంగా క్వారంటైన్ కేంద్రానికి తరలించింది. కరోనా కేసులు అధికంగా ఉన్న నగరాల్లో కొన్ని వారాలపాటు లాక్డౌన్ ఆంక్షలు విధించింది.
కాగా, చైనా అమలు చేస్తున్న జీరో కోవిడ్ విధానంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో కోవిడ్ విధానాన్ని చైనా సడలించింది. లాక్డౌన్లు, సామూహిక కరోనా టెస్టింగ్, క్వారంటైన్ వంటి ఆంక్షలను ఇటీవల ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకోని చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. దీంతో కరోనా రోగుల తాకిడిని ఆసుపత్రులు తట్టుకోలేకపోతున్నాయి. వైద్యులు కూడా చికిత్స అందించలేక చేతులెత్తేస్తున్నారు. పని అలసటతో సొమ్మసిల్లిపోతున్నారు.
官方说没有重症,看看重庆医科大学附属第一医院 急诊留观区域。 pic.twitter.com/UsGiKoS4gG
— iPaul🇨🇦🇺🇦 (@iPaulCanada) December 20, 2022