న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆయుధాల తయారీ కంపెనీలు 2024లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందాయి. టాప్-100 డిఫెన్స్ కంపెనీలు అమ్మిన ఆయుధాల విలువ రూ.60,82,892 కోట్లు. ఈ పెరుగుదలకు కారణం ఉక్రెయిన్, గాజాలలో యుద్ధాలేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తెలిపింది.
ప్రభుత్వాలు ఆయుధాల కోసం పోటీ పడ్డాయని పేర్కొంది. 2023తో పోల్చుకుంటే, 2024లో ఈ కంపెనీల రెవెన్యూ 6 శాతం పెరిగింది. 2015తో పోల్చుకుంటే 26 శాతం పెరిగింది.