గూగుల్‌కు పోటీగా రంగంలోకి..
వాషింగ్టన్: టెక్నాలజీ మార్కెట్లో యాపిల్, గూగుల్ దిగ్గజ సంస్థలుగా ఉన్నాయి. పలు అంశాల్లో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఆధిపత్యం కొనసాగిస్తున్న సెర్చ్ ఇంజిన్ రంగంలో కూడా ఆ సంస్థకు పోటీ పడేందుకు యాపిల్ సిద్ధమౌతున్నట్టు తెలుస్తున్నది.
యాపిల్ త్వరలో ఒక కొత్త యూజర్ సెంట్రిక్ సెర్చ్ ఇంజిన్‌ను తీసుకురానున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. 2023లో జరగనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ సందర్భంగా యాపిల్ కొత్త సెర్చ్ ఇంజిన్‌ను ప్రకటించే అవకాశం ఉందని టెక్ బ్లాగర్ రాబర్ట్ స్కోబ్లే తెలిపారు.