Apple Watch: యాపిల్ వాచ్‌పై వర్ణవివక్ష కేసు.. బ్లడ్ ఆక్సిజన్ రీడర్‌పై ఫిర్యాదులు
Apple Watch ప్రఖ్యాత టెక్ సంస్థ యాపిల్‌కు చెందిన వాచ్‌పై విమర్శలు వస్తున్నాయి. యాపిల్ వాచ్ వర్ణవివక్షకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీపై కేసు కూడా బుక్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ మోరెల్స్ అనే వ్యక్తి ఆ కేసు దాఖలు చేశారు. వాచ్‌లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ రీడర్ తప్పుడు ఫలితా
న్యూయార్క్: ప్రఖ్యాత టెక్ సంస్థ యాపిల్‌కు చెందిన వాచ్‌పై విమర్శలు వస్తున్నాయి. యాపిల్ వాచ్ వర్ణవివక్షకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీపై కేసు కూడా బుక్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ మోరెల్స్ అనే వ్యక్తి ఆ కేసు దాఖలు చేశారు. వాచ్‌లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ రీడర్ తప్పుడు ఫలితాలు చూపిస్తున్నట్లు కేసులో పేర్కొన్నారు.
చర్మ వర్ణం మారినప్పుడు ఆ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ రీడర్ సరైన రీతిలో రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వాచ్‌లో ఉన్న ఆక్సీమీటర్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిల్ని సరైన రీతిలో ఆ మీటర్ లెక్కించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి సమయంలో వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ చూసుకున్న పేషెంట్లు హైరానాకు గురయ్యారని, కాస్త నలుపు వర్ణం ఉన్నవారిలో మీటర్ సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. దీని వల్లే ఆ సమయంలో అనేక మంది పేషెంట్లు.. కంగారలో హాస్పిటళ్ల చుట్టూ పరిగెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ మీటర్ రోగుల్ని తప్పుదారి పట్టించినట్లు కూడా ఓ స్టడీ రిపోర్ట్‌ను కేసులో ఫైల్ చేశారు.
యాపిల్ వాచ్‌పై దాఖలు చేసిన నష్టపరిహారం కేసులో అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు కూడా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

