iPhone | వాషింగ్టన్: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు పెగాసస్ సెగ తగిలింది. ఈ ఫోన్లలో ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించారని వచ్చిన ఆరోపణలపై యాపిల్ వెంటనే అప్రమత్తమైంది. వినియోగదారులకు రెండు సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసింది.
సెక్యూరిటీ పరంగా ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని యాపిల్ ఫోన్లపై స్పైవేర్‌ను పంపే అవకాశముందని ప్రముఖ డిజిటల్ నిఘా సంస్థ సిటిజన్ హెచ్చరించడంతో నివారణకు యాపిల్ నిర్వాహకులు అప్డేట్లను విడుదల చేశారు. వినియోగదారులు వెంటనే ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కోరారు.