వాషింగ్టన్, ఫిబ్రవరి 18: అంటార్కిటిక్ సముద్ర మంచు(ఐస్) కవచం క్రమంగా తగ్గిపోతున్నది. తాజా నమోదు ప్రకారం.. అంటార్కిటిక్పై మంచు విస్తీర్ణం గత ఏడాది కనిష్ఠ స్థాయి రికార్డును కూడా బద్దలు కొట్టింది. గత ఏడాది కంటే ఈసారి కొద్ది రోజుల ముందుగానే ఈ కనిష్ఠ స్థాయి నమోదైందని అమెరికాకు చెందిన నేషనల్ స్నో అండ్ ఐస్ డాటా(ఎన్ఎస్ఐడీసీ) పేర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నాటికి అంటార్కిటిక్పై మంచు విస్తీర్ణం 19.1 లక్షల చదరపు కిలోమీటర్లకు తగ్గిందని, ఇది గత ఏడాది ఫిబ్రవరి 25న 19.2 లక్షల చదరపు కిలోమీటర్లుగా ఉన్నదని వెల్లడించింది. కరిగే సీజన్ మరికొద్ది వారాలు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మంచు మరింతగా తగ్గే అవకాశం ఉన్నదని తెలిపింది.