హౌస్టన్, జూన్ 3: అమెరికాలోని కాలిపోర్ని యా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. 23 ఏండ్ల నితీ శా కందుల గత నెల 28 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. కాలిఫోర్నియా స్టేట్ యూ నివర్సిటీలో నితీశా చదువుతున్నారు. ఆమె చివరిగా లాస్ ఏంజెల్స్‌లో కాలిపోర్నియా నంబర్ ప్లేట్‌తో ఉన్న టయోటా కారును గత నెల 30న నడుపుతూ కనిపించిందని కొంత మంది చెప్పినట్టు శాన్ బెర్నార్డినో పోలీసులు వెల్లడించారు. నితీశా కందుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. గత నెల 26 ఏండ్ల రూపేశ్ చంద్ర అనే విద్యార్థి షికాగోలో ఆచూకీ లేకుండా పోయాడు. మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే విద్యార్థి ఏప్రిల్‌లో క్లీవ్‌ల్యాండ్‌లో హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. భారత్ నుంచి వెళ్లిన క్లాసికల్ డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్‌ను దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఫిబ్రవరిలో 23 ఏండ్ల సమీర్ కామత్ అనే పుర్డ్యూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఇండియానాలోని ఓ అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో శవంగా కనిపించాడు.