లండన్, మే 28: కొవిడ్ తర్వాత మరో మహమ్మారి మానవాళిపై దాడి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్ వాల్లన్స్. త్వరలోనే జరగనున్న బ్రిటన్ ఎన్నికలపై ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ… మరో మహమ్మారి రాక తప్పదని, కాబట్టి వచ్చే ప్రభుత్వం ఇందుకు సంసిద్ధంగా ఉండేందుకు ప్రాధా న్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఇందుకు గానూ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సిన్లు, చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంటే కొవిడ్-19 వల్ల కలిగిన దారుణ పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూడొచ్చని ఆయన తెలిపారు. ఇందుకు ప్రపంచ సహకారం కూడా అవసరమని అన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం ఎలా ముఖ్యమైనదో, మహమ్మారులను ఎదుర్కొనేందుకు కూడా సంసిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.