Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ వేళ.. ఫ్రెంచ్ రైల్వే లైన్ల ధ్వంసం
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. కొన్ని రూట్ మళ్లించారు.
పారిస్ : ఇవాళే పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) ప్రారంభంకానున్నాయి. ఓపెనింగ్ సెర్మనీ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అకస్మాత్తుగా ఇవాళ ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జరిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్సీఎఫ్కు చెందిన నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. రైల్వే సామాగ్రికి నిప్పు పెట్టారు. దీంతో లైనింగ్ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పలు చోట్లు రైల్వే లైన్లను ధ్వంసం చేశారు.
మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ అటాక్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పారిస్కు పశ్చిమంలో ఉన్న అనేక హై స్పీడ్ టీజీవీ లైన్లు ప్రభావానికి లోనయ్యాయి. సిటీలోని స్టేషన్లలో ప్రయాణికుల క్యూ లైన్లు ఏర్పడ్డాయి. అనేక రైళ్లను రద్దు చేశారు. అట్లాంటిక్, నార్తర్న్, ఈస్ట్రన్ హై స్పీడ్ లైన్లను ధ్వంసం చేసినట్లు ఎస్ఎన్సీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
రైల్వే వ్యవస్థపై అటాక్ వల్ల సుమారు 8 లక్షల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ రైళ్లు కదిలినా.. ప్రయాణం సమయం చాలా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

