Padmanabham | ఫైనాన్షియర్ చేతిలో మోసపోయిన సీనియర్ నటుడు స్వర్గీయ పద్మనాభం..!
Padmanabham | పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయన తీసిన సినిమాల గురించి చెబుతూ ఓ ఫైనాన్షియర్ (Financier) చేతిలో ఎలా మోసపోయారో చెప్పుకొచ్చారు.
Padmanabham | తెలుగు సినిమా చరిత్రలో హాస్య నటుడిగా ,సహాయ నటుడిగా, నిర్మాతగా,దర్శకుడిగా ఎన్నో మజిలీలు చేశారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . ఆయనకు పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు. ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
ఎన్నో మంచి మంచి పాత్రలు చేసి అందరి అభిమానాన్ని పొందారు పద్మనాభం. ఆయన చిత్రాల్లో నటించడంతోపాటు పలు చిత్రాలకు దర్శక , నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయన తీసిన సినిమాల గురించి చెబుతూ ఓ ఫైనాన్షియర్ (Financier) చేతిలో ఎలా మోసపోయారో చెప్పుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే..
నేను తీసిన ,చేసిన సినిమాలన్నింటిలోనూ నాకు బాగా నచ్చిన చిత్రం శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ. అందులో ఓ పేదవాడు మంచితనంతో రాజుగా ఎదిగి రామరాజ్యం స్థాపించడం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి ఆ సినిమాను నిర్మించాను. అప్పట్లో బీహార్ లో తుఫాన్ వస్తే ఆ సినిమా లాభాలనుంచి పదిహేను వేలు విరాళంగా ఇచ్చాము. నిర్మాతగా విజయం సాధించడంతో దర్శకుడిగా మారి `శ్రీరామకథ, జాతక రత్న మిడతం బొట్లు`, ఆజన్మ బ్రహ్మచారి,`మాంగళ్య భాగ్యం`సినిమాలు తీశాను. అయితే ఇంత అనుభవం ఉండి కూడా నేను ఓ ఫైనాన్షియర్ చేతిలో మోసపోయాను.. ఓ ఫైనాన్షియర్ వద్ద అరవై వేల రూపాయలు అప్పు తీసుకుంటూ ప్రామిసరి నోటుపై సంతకం పెట్టాను.
ఒకవేళ అప్పు తీర్చకపోతే నేనప్పటివరకు తీసిన ఎనిమిది సినిమాల మీదా హక్కులు ఆ ఫైనాన్సియర్ సొంతం చేసుకుంటానని అందులో వుంది. కాని నేను అప్పు తీర్చినా కూడా నాకు తప్పుడు లెక్కలు చూపించి నాసినిమా నెగెటివ్ లు అన్నీ తను స్వాధీనం చేసుకుని, నన్ను చాలా బాధలు పెట్టాడు. అప్పుడు నేను పడ్డ బాధలు, ఒత్తిడి వర్ణనాతీతం. ఆ బాధ తట్టుకోలేక నా భార్యను తీసుకుని కాశీకి వెళ్లాను. సీనియర్ నటులు `నాగయ్య అంతటి మహానుభావులకే ఇలాంటి కష్టాలు తప్పలేదు అనుకున్నాను. కాకపోతే ఆ సినిమాలు నా దగ్గర లేకపోయినా.. ఆ నెగెటివ్‌లు ఎక్కడో ఒక దగ్గర భద్రంగా వున్నాయనే తృప్తి నాలో వుండేది. అవి చిరస్థాయిగా ఉండిపోతాయన్న ఆనందం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Read Also :
Rashmika Mandanna | చీరకట్టులో రష్మిక మందన్నా రంజితమే స్టెప్పులు.. ట్రెండింగ్‌లో విజువల్స్
Vikramarkudu 4K | జక్కన్న విక్రమార్కుడు రీరిలీజ్ టైం.. రవితేజ కటౌట్ అదిరిందంతే
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

