ఢాకా, జనవరి 25 : బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ హిందూ యువకుడిని దుండగులు సజీవ దహనం చేశారు. శుక్రవారం రాత్రి నార్సింగ్డి ప్రాంతంలోని ఓ షాప్లో చంచల్ చంద్ర భౌమిక్(23) అనే యువకుడు నిద్రిస్తుండగా దుండగులు దాడి చేశారు. షాప్ షట్టర్ మూసేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మంటల వేడికి నిద్రలో నుంచి లేచిన చంచల్ బయటపడేందుకు విఫలయత్నం చేశాడు. చంచల్ మంటల్లో కాలి చనిపోయాడని నిర్ధారించుకున్నాకే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.