ఒట్టావా, మే 12: గతేడాది జూన్‌లో హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో మరో భారత జాతీయుడిని అరెస్ట్ చేసినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు. తాము అరెస్ట్ చేసిన వ్యక్తి బ్రాంప్టన్‌లో నివసించే అమన్‌దీప్ సింగ్(22) అని తెలిపారు. నిందితుడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్, హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై కేసు నమోదు చేశామని చెప్పారు. నిజ్జర్ హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.