వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్‌లో తాజాగా మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. ఎగుమతుల మండలి (ఎక్స్పోర్ట్ కౌన్సిల్) సభ్యురాలిగా ప్రముఖ మహిళా వ్యాపారవేత్త షమీనా సింగ్‌ను బైడెన్ నియమించారు. ఈమేరకు తాజాగా శ్వేతసౌధం ఓ అధికారిక ప్రకటన జారీచేసింది. ‘మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజీవ్ గ్రోత్’ వ్యవస్థాపకురాలు, అధ్యక్షరాలు షమీనా సింగ్ మాట్లాడుతూ, ఉన్నతస్థాయి కమిటీలో చోటు దక్కినందుకు గర్వంగా ఉందన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో అధ్యక్షుడికి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల పరపతి పెంచే ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆమె అపార అనుభవం కలిగివున్నారు. గతంలోనూ ప్రతినిధుల సభ, సెనెట్‌లో కీలక పదవులు పొందారు. వ్యాపార వర్గాల సమస్యలు, పరిశ్రమలు, కార్మికరంగం..తదితర అంశాలపై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల్లో అధ్యక్షుడికి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ సలహాలు, సూచనలు అందిస్తుంది.