శాన్ఫ్రాన్సిస్కో, జనవరి 5: అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట నేవార్క్‌లోని స్వామినారాయణ్ మందిర్‌పై దాడి ఘటనను మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకున్నది. తాజాగా కాలిఫోర్నియాలోని షెరావాలి ఆలయంపై దాడి జరిగింది.
ఆలయ గోడలపై కొందరు ఖలిస్థాన్ అనుకూల రాతలు రాశారు. విషయం తెలిసిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.