Donald Trump | సుంకాల వివాదం వేళ.. కెనడా ప్రధానితో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
Donald Trump | అమెరికా - కెనడా మధ్య సుంకాల వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫోన్లో మాట్లాడారు.
Donald Trump | అమెరికా – కెనడా మధ్య సుంకాల వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.
‘నేను ఇప్పుడే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఫోన్లో మాట్లాడాను. ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. చాలా విషయాలపై ఓ ఒప్పందానికి వచ్చాం. రాజకీయాలు, వ్యాపారం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు త్వరలో భేటీ అవుతాం. కెనడా ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశామవుతాం’ అని ట్రంప్ తన పోస్ట్‌లో వెల్లడించారు.
అమెరికాతో పాత దోస్తీ ముగిసింది..
కెనడా పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధించడంతోపాటు.. తాజాగా వాహన దిగుమతులపై కూడా 25శాతం సుంకాన్ని విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై కెడాన ఘాటుగా స్పందించింది. ఈ చర్యతో అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ (Tariffs) ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అమెరికా (USA)తో వాణిజ్యయుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.
ట్రంప్ నిర్ణయాన్ని అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ చర్యతో ఆర్థికవ్యవస్థ బలోపేతం, భద్రత, సైనిక సహకారం విషయంలో అమెరికా-కెనడా మధ్య ఉన్న పాతబంధం నేటితో ముగిసిపోయిందన్నారు. అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను తాము ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటామని ప్రకటించారు. ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అగ్రరాజ్యంపై త్వరలో ప్రతీకార సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
విదేశీ కార్లపై 25 శాతం సుంకం
అమెరికా దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై (Foreign Made Vehicles) 25 శాతం సుంకం (Tariffs) విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్య శాశ్వతమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. అమెరికాలో తయారు చేసిన వాహనాలపై ఎలాంటి సుంకం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ సుంకం శాశ్వతంగా ఉంటుంది. యూఎస్‌లో తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్యతో అమెరికాలో విదేశీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. ట్రంప్ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బే. దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Also Read..
Elon Musk | ‘ఎక్స్’ను అమ్మేశా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
Myanmar | మయన్మార్‌లో 1000 దాటిన మరణాల సంఖ్య.. 2 వేల మందికిపైగా గాయాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

