కొలంబో, ఏప్రిల్ 23: ఇంధన దిగుమతుల కోసం మరో 500 మిలియన్ డాలర్ల (రూ.3,824 కోట్లు) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపిందని శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రి వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఉద్దీపన ప్యాకేజీని అందివ్వడంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
మరో బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు)రుణం ఇచ్చే అంశాన్ని భారత్ పరిశీలిస్తుందని ఆశిస్తున్నామన్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో శ్రీలంక దిగుమతులకు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నది.