వాషింగ్టన్: వలసలు లేకపోతే అమెరికాలో నిరుడు జనాభా తగ్గిపోయి ఉండేదని అమెరికా జన గణన సంస్థ గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. వలసల కారణంగా అమెరికాలో ఆసియన్ల సంఖ్య పెరిగిందని, 2022 నాటికి అమెరికా జనాభా 33.32 కోట్లకు చేరుకుందని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 0.4 శాతం ఎక్కువని ఆ సంస్థ తెలిపింది. ఇతర దేశాల నుంచి శ్వేత జాతీయుల రాక కూడా భారీగా పెరిగిందని వివరించింది.