క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే ఘటన అమెరికాలో జరిగింది. ‘మీ భర్తను ఎలా చంపాలి’ అనే నవల రాసిన ఓ ప్రముఖ రచయిత్రి తన భర్తను దారుణంగా కాల్చి చంపింది. కోర్టు ఆమెకు జీవిత ఖైదు వేసింది. ఈ వార్త అమెరికాలో కలకలం రేపింది.
నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ (71) అమెరికాలో ఫేమస్ రచయిత్రి. ‘మీ భర్తను ఎలా చంపాలి’ అనే పుస్తకంతో ఫేమస్ అయింది. కాగా, ఆమె నిజంగానే తన భర్తను తుపాకీతో కాల్చి చంపిందనే అభియోగంపై విచారించిన కోర్టు ఆమెకు జీవితఖైదు విధించింది. ఆమె 25 ఏళ్ల తర్వాతే పెరోల్‌కు అప్లై చేసుకునే చాన్స్ ఉంటుదని ఒరెగాన్కు చెందిన ఒక న్యాయమూర్తి తెలిపారు.
నాన్సీ భర్త డేనియల్ బ్రోఫీ 2018లో అతడు పనిచేసే ఇన్స్టిట్యూట్లో చనిపోయి కనిపించాడు. అతడిని గన్‌తో రెండుసార్లు షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నాన్సీ అదే ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కింది. దీంతో పోలీసులు నాన్సీని అదుపులోకి తీసుకున్నారు. ఆమె విచారణ నెలపాటు సాగింది. 1.5 మిలియన్ డాలర్ల విలువైన జీవిత బీమా కోసం ఆమె భర్తను చంపినట్లు కేసు నమోదు చేశారు. కాగా, తన కొత్త నవల అధ్యయనం కోసమే తుపాకీ కొనుగోలు చేసినట్లు నాన్సీ చెప్పారు. నాన్సీ ‘రాంగ్ నెవర్ ఫెల్ట్ సో రైట్’, ‘రాంగ్ హస్బెండ్’, ‘రాగ్ లవర్’ లాంటి పుస్తకాలు రాసింది. ఇప్పటికీ ఆన్లైన్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న “హౌ టు కిల్ యువర్ హస్బెండ్” అనే ఆమె పుస్తకం ఇష్టంలేని భర్తలను ఎలా వదిలించుకోవాలో తెలుపుతుంది.