న్యూయార్క్: హెచ్ఐవీని నయం చేయడానికి అవలంబించిన సరికొత్త చికిత్స సత్ఫలితాలు ఇచ్చిందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బొడ్డుతాడు రక్తంలోని హెచ్ఐవీ నిరోధక మూలకణాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ద్వారా విజయవంతంగా హెచ్ఐవీని నయం చేయవచ్చని తెలిపారు.
2017లో న్యూయార్క్‌కు చెందిన ఓ మధ్య వయస్కురాలికి ఈ చికిత్స చేయగా, ప్రస్తుతం ఆమె రక్తంలో హెచ్ఐవీ జాడలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.