Peru | పెరూ (Peru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 22 ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన అమెరికాకు చెందిన ఓ పర్వతారోహకుడి (American Mountaineer) మృతదేహం తాజాగా బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 59 ఏళ్ల విలియం స్టాంప్‌ఫ్ల్ అనే పర్వతారోహకుడు 2002లో పెరూలోని హుస్కరన్ (Huascaran) పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో 6,700 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని ఎక్కుతున్న క్రమంలో అతడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. దీంతో విలియం కోసం పోలీసులు, స్థానిక అధికారులు తీవ్రంగా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక విలియం కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇంతలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పర్వతంపై ఉన్న మంచు క్రమంగా కరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే విలియం మృతదేహం బయటపడింది.
విచిత్రం ఏంటంటే.. విలియం మృతదేహం చెక్కుచెదరకుండా ఉండటమే. అతడిపై ఇన్నేళ్లు మంచు పేరుకుపోవడంతో ఆ చల్లదనానికి అతని శరీరం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 22 ఏళ్లు అయినప్పటికీ ఒంటిపై ఉన్న దుస్తులు, పాస్‌పోర్ట్ సహా ఇతర వస్తువుల ఏమాత్రం పాడుకాలేదు. పాస్‌పోర్ట్ ఆధారంగా డెడ్‌బాడీ 22 ఏళ్ల క్రితం మిస్సైన విలియంగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు స్థానిక మీడియా నివేదించింది.
Also Read..
PM Modi | భారత్ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది : ప్రధాని మోదీ
Kathua | ప్రతీకారం తీర్చుకుంటాం.. కథువా ఉగ్రదాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్