Donald Trump: క్యాపిటల్ హిల్ అటాక్.. ట్రంప్‌కు సమన్లు జారీ
Donald Trump:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సమన్లు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ప్యానల్ ఆ ఆదేశాలను ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించిన
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు సమన్లు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ప్యానల్ ఆ ఆదేశాలను ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించిన తొలి అమెరికా అధ్యక్షుడివి నువ్వే అంటూ ఆ సమన్లలో పేర్కొన్నారు. అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసి కూడా ప్రజల్ని రెచ్చగొట్టినట్లు ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటనను విచారిస్తున్న చట్టసభ ప్రతినిధుల ముందు నవంబర్ 14వ తేదీలోగా హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
డెమోక్రటిక్ పార్టీ పాలనలో ప్రభుత్వం విఫలమైందని, వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే తనకు సమన్లు జారీ చేసినట్లు ట్రంప్ అన్నారు. విచారణ కమిటీ అన్ని రూల్స్‌ను ఉల్లంఘించినట్లు ట్రంప్ తరపు న్యాయవాది తెలిపారు. ఒకవేళ సమన్ల ప్రకారం విచారణకు ట్రంప్ హాజరుకాకుంటే అప్పుడు ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
విచారణ కమిటీకి నవంబర్ 4వ తేదీలోగా ట్రంప్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ హాజరుకాకున్నా.. లేదా అడిగిన పత్రాలను సమర్పించకుంటే, అప్పుడు ఈ కేసును న్యాయశాఖకు బదిలీ చేసే అవకాశాలు ఉంటాయి. క్యాపిటల్ హిల్ దాడి కేసులో ట్రంప్ వ్యూహాకర్త స్టీవ్ బానన్‌కు కాంగ్రెస్ కమిటీ సుమారు 6500 డాలర్ల ఫైన్ విధించింది. నాలుగు జైలు శిక్షకు కూడా ఖరారు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

