డెన్వర్: అమెరికా ఎయిర్‌లైన్స్(American Airlines)కు చెందిన విమానం.. డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదానికి గురైంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డల్లాస్ ఫోర్కు వెళ్తున్న విమానాన్ని డెన్వర్‌కు దారిమళ్లించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. దాని నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా ఆ విమానాన్ని కప్పేసింది. విమానం నుంచి మంటలు, పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు వీడియోలకు చిక్కాయి. అయితే ప్రాణ భయంతో ప్రయాణికులు..ఆ విమాన రెక్కలపై నిలుచున్నారు. పొగ కమ్మేసిన ఆ విమానం నుంచి రెక్కల మార్గంలో ప్రయాణికులు బయటకు వచ్చారు.
ల్యాండ్ అయిన తర్వాత విమానం గేటు దిశగా కదులుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇంజిన్ సంబంధిత సమస్యల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 172 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా టర్మినల్‌కు చేర్చినట్లు అమెరికా ఎయిర్‌లైన్స్ పేర్కొన్నది. ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు. ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో విచారణ చేపట్టాల్సి ఉన్నది.
🚨🇺🇸BREAKING: AMERICAN AIRLINES PLANE CATCHES FIRE AT DENVER INTERNATIONAL
Passengers were evacuated after an American Airlines plane reportedly caught fire at Denver International Airport.
Source: @IntelPointAlert pic.twitter.com/fYJ9o4ndoK
— Mario Nawfal (@MarioNawfal) March 14, 2025