హెచ్-1బీ వీసాదారులపై మరో పిడుగు.. 60 రోజుల గడువును తొలగించేందుకు యూఎస్ మరో అడుగు
హెచ్-1బీ కార్మికులపై ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత హెచ్-1బీ కార్మికులకు లభించే 60 రోజుల గడువును తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కీలక నియంత్రణ సమీక్షలో వైట్‌హౌస్ ఆమోదించింది.
వాషింగ్టన్, ఆగస్టు 29: హెచ్-1బీ కార్మికులపై ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత హెచ్-1బీ కార్మికులకు లభించే 60 రోజుల గడువును తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కీలక నియంత్రణ సమీక్షలో వైట్‌హౌస్ ఆమోదించింది. దీంతో ఈ విధానం అమలుకు మరింత చేరువైంది. బ్లూమ్‌బర్గ్ లా ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫయిర్స్ (ఓఐఆర్ఏ) గురువారం ఆమోదం తెలిపింది. దీనిని అమలు చేసేందుకు త్వరలోనే బహిరంగంగా ప్రకటన విడుదల కావచ్చునని తెలిపింది.
2017లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ ప్రత్యేక వృత్తి కార్మికులు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే వారు 60 రోజులపాటు లేదా అధికారిక చెల్లుబాటు కాలంవరకు అమెరికాలో ఉండవచ్చు. ఆ వ్యవధిలో వారు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడమో లేదా అధికారికంగా దేశంలో కొనసాగడానికి ఉన్న ఇతర అవకాశాలను వెతుక్కోవడమో చేసేవారు. అయితే ఈ ప్రతిపాదిత కొత్త నిబంధన ఇప్పుడా 60 రోజుల వెసులుబాటును తొలగిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

