‘స్వాట్’ శాటిలైట్‌ను అభివృద్ధి చేసిన అమెరికా, ఐరోపా
వాషింగ్టన్, జూలై 25: భూమిపై 75 శాతం వరకు నీరు ఉన్నప్పటికీ, తాగడానికి యోగ్యమైన జలం పరిమితమే. కొన్నిచోట్ల నీటివనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి జాడ తెలియడంలేదు. దీంతో పలు దేశాలు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపడానికి అమెరికా, ఐరోపా దేశాలు కలిసి సంయుక్తంగా ‘స్వాట్’ పేరిట ఓ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. భూమిపై ఉన్న 95 శాతానికి పైగా సరస్సులు, నదుల సమాచారం, వాటి నైసర్గిక స్వరూపాన్ని ఈ శాటిలైట్ అత్యంత కచ్చితత్వంతో లెక్కకడుతుంది. 15 ఎకరాల కంటే పెద్దవైన సరస్సులు, 330 అడుగుల కంటే వెడల్పైన నదుల గురించి కూడా ‘స్వాట్’ ఉపగ్రహం తెలియజేస్తుందని తమ్లిన్ పావెల్సీ తెలిపారు.