వాషింగ్టన్, డిసెంబర్ 24: క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల సందర్భంగా అమెరికాలో విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని విమానాలు అమెరికాలోని విమానాశ్రయాలలోనే ఉండిపోవాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) మంగళవారం ఆదేశించింది. దీంతో ఉదయం 7 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలన్నీ దేశవ్యాప్తంగా గ్రౌండింగ్ అయ్యాయి.
గంట తర్వాత విమానాలన్నిటినీ టేకాఫ్‌కు అనుమతి ఇచ్చినట్టు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సాంకేతిక సమస్య ఏమిటో మాత్రం వారు వెల్లడించలేదు.