వాషింగ్టన్: కస్టమర్ కుమార్తె, వారి చిన్న పెట్ డాగ్‌పై బలమైన పెద్ద కుక్క దాడి చేసింది. కాగా, అప్పుడే అక్కడకు వచ్చిన అమేజాన్ డెలివరీ మహిళ ధైర్యం చేసి వారిద్దరిని దాని బారి నుంచి కాపాడింది. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఈ ఘటన జరిగింది. 19 ఏండ్ల లారెన్ రే పెంపుడు కుక్క ఇంటి నుంచి బయటకు రాగా ఒక పెద్ద కుక్క దానిపై దాడి చేసింది. కుక్క పిల్ల అరుపులు విని బయటకు వచ్చిన లారెన్, దానిని కాపాడేందుకు ప్రయత్నించింది. అతి కష్టంతో తన పెట్ డాగ్‌ను చేతులతో పైకి ఎత్తి కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
అయితే పెద్ద కుక్క వారిని విడిచిపెట్టలేదు. లారెన్‌పై కూడా అది దాడి చేయబోగా సహాయం కోసం ఆమె కేకలు వేసింది. ఇంతలో వారి ఇంటికి వచ్చిన అమేజాన్ డెలివరీ మహిళ స్టెఫానీ లోంట్జ్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అక్కడకు వచ్చి ఆ పెద్ద కుక్కను అడ్డుకున్నది. లారెన్, ఆ పెద్ద కుక్క మధ్య నిలిచి అటూ ఇటూ జంప్ చేస్తూ దాని నుంచి వారిని కాపాడింది. దీంతో కస్టమర్ కుమార్తె తన పెట్ డాగ్‌ను తీసుకుని ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకుంది. బ్యాడ్ డాగ్ అంటూ స్టెఫానీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, తనను, పెట్‌ను కుక్క బారి నుంచి కాపాడిన అమేజాన్ డెలివరీ మహిళకు లారెన్ అనంతరం ధన్యవాదాలు తెలిపింది. ‘నాకు ధన్యవాదాలు చెప్పడానికి తగినంత సమయం లభించలేదు. నేను అప్పుడు భయంతో హడలిపోయాను. నేను మిమ్మల్ని మళ్లీ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకెంతో రుణపడి ఉంటాను’ అని స్టెఫానీతో అన్నది.
అయితే ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ఎవరైనా ఇదే పని చేస్తారని స్టెఫానీ అన్నది. ‘ఆ అరుపులు నా సొంత బిడ్డ గురించి ఆలోచించేలా చేశాయి. ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు. దీనిని మాతృత్వం అని నేను కూడా అనుకోను. ఇది కేవలం మానవులు చేయాల్సిన పని’ అని ఆ వీరోచిత అమెజాన్ ఉద్యోగిని పేర్కొంది.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ సమయస్ఫూర్తి, ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు.
An #Amazon delivery driver has saved a woman and her dog from a vicious pit bull attack in #LasVegas. The heroic courier, who saved the woman and her #dog from the attack, has conquered hearts across social media.#dogs #dogattack #pitbull #anews pic.twitter.com/3f1yKZ5jLd
— ANews (@anews) December 21, 2021