సెల్ఫ్ డ్రైవింగ్ అమెజాన్ రోబోట్యాక్సీ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ నుంచి వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కార్పొరేట్ దిగ్గజం అమెజాన్.. పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ విద్యుత్ రోబో ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇటీవలే ఓ అమెరికా జెయింట్ సంస్థ నుంచి టేకోవర్ చేసిన స్టార్టప్ సంస్థకు జూక్స్ ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ఈ ప్రాజెక్టులో రూపుదిద్దుకున్న ప్రొటోటైప్ రోబోటిక్ ట్యాక్సీ కారులో నలుగురు ప్రయాణికులు హాయిగా కూర్చుని ప్రయాణం చేయొచ్చు. దీనికి గల ఫోర్ స్మాల్ గైడ్ వీల్స్ వల్ల తేలిగ్గా పార్కింగ్ కూడా చేయొచ్చు.
స్టీరింగ్ వీల్ ముందు డ్రైవర్ లేకుండా ప్రయాణించే ఈ రోబోటిక్ ట్యాక్సీ.. ‘జూక్స్’ 75 మైళ్ల (సుమారు 120 కిలోమీటర్ల) వేగంతో దూసుకెళ్లగలదు. కృత్రిమ మేధ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌తో తయారైన ఈ కారు ప్రయాణ సమయంలో రోడ్డు మీద (ఇతర వాహనాలు, పెడెస్ట్రియన్స్, జంతువుల నుంచి వచ్చే) ముప్పును ముందే పసిగడుతుంది.
16 గంటల సామర్థ్యం గల 133 కిలోవాట్ల బ్యాటరీ దీని సొంతం.. అంటే దాదాపు ఒక రోజంతా అంతరాయం లేకుండా ప్రయాణం చేయగల శక్తి దీనికే సాధ్యం. ఈ కారు ప్రయాణిస్తున్న 150 మీటర్ల వైశాల్యంలో వివిధ కోణాల్లో పరిస్థితులను తెలుసుకునేలా 360 డిగ్రీల వ్యూతో పరిశీలించేందుకు లిడార్ టెక్నాలజీతో కూడిన పలు కెమెరాలను, రాడార్లను ఇందులో అమర్చారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, లాస్వెగాస్లలో దీన్ని పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.